TT Ads

కర్నూల్ జిల్లా:జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు, సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీలత గారుల ఆదేశాలతో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈరోజు రాత్రి హైదరాబాద్ నుండి బెంగళూరు కి వెళ్తున్న టి స్ ఆర్ టి సి గరుడ ప్లస్, నెంబర్ TS 08 Z 0272 గల బస్సు నందు తమిళనాడు రాష్ట్రము , సేలం జిల్లా, శివపేట్ కి చెందిన ఆర్.ఉదయకుమార్,వయస్సు-47, తండ్రి పేరు రాజారామ్, అను ఇతను తన దగ్గర గల బ్యాగ్ నందు సుమారు : 25 -కెజి ల వెండి నాణేలను,(పెద్ద వెండి పలకలు రెండు, చిన్నది ఒక్కటి,ఇంకా చాలా చిన్నవి రెండు,వెండి బిస్స్కేట్స్ -39 కాళ్ళ పట్టిలు పాతవి సుమారు ఒక్క కెజి మొత్తము -25కెజి ల వెండి.ఎటువంటి ఆధారాలు లేకుండగా తీసుకెళ్తున్నట్లుగా గుర్తించి వాటిని స్వాధీన పరచుకొని, తాలూక పోలీస్ స్టేషన్ నందు ఎస్.ఈ.బి, ఇన్స్పెక్టర్ ఏన్.లక్ష్మి దుర్గయ్య గారు అప్పగించడమైనది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *