TT Ads

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.

పాలక, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం.

ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతుండగా… ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

ఈ రోజు సాయంత్రం 5.00గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు.

ఇక, ఎల్లుండి రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఈనెల 14న ఓట్లను లెక్కించనున్నారు.

పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో… ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *