TT Ads

హైదరాబాద్ లో ని అరణ్య భవన్ లో ముధోల్ నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, ENC మురళీధరరావు, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై గురించి ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు. నియోజకవర్గంలో పలు చోట్ల చెక్డ్యాంలు నూతన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే గుండెగావ్ ముంపు సమస్య సత్వరంగా పరిష్కరించాలని విన్నవించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ పథకానికి నీరు అందించడం వల్ల ఏర్పడే సమస్య పరిష్కరించాలని, సీసీ కెనాల్ విస్తరణ చేయాలని కోరారు. కుంటాల మండలంలోని వెంకుర్ చెరువు పునరుద్ధరణ మరియు కుబీర్ మండలంలోని మర్ల గొండా నూతన చెరువు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వీటిలో కొన్నిటికి త్వరలోనే అనుమతిస్తామని ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్ గారు హామీ ఇచ్చారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *