TT Ads

నీలకంఠాపురంలో వెలుగు చూసిన శాతవాహనుల కాలపు గణేశ ప్రతిమ.

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో శాతవాహనుల కాలపు గణేశ ప్రతిమ బయల్పడింది. మాజీ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన వ్యవసాయ భూముల్లో పోతుగుండు దిన్నె దగ్గర, పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి గురువారం జరిపిన విసృత అన్వేషణలో 6×3×1.5 సేం మీ కొలతలు ఉన్న మట్టి వినాయక విగ్రహం మెరుస్తున్న ఎరుపు, నలుపు – ఎరుపు, ఎరుపు మట్టి పాత్రల సకలాలతో పాటు బయల్పడింది. తనతో పాటు అన్వేషణలో పాల్గొన్న స్థానికుడు శ్రీనివాస్ గుర్తించిన ఈ విగ్రహం పెద్ద పొట్ట, ఎడమవైపుకు తిరిగిన తొండం, ఏనుగు మొఖం, పగిలిన చేతులు, కాళ్లు, చెవులు, ఆ విగ్రహం వినాయకునిదే అని తెలియజేస్తోంది శివనాగిరెడ్డి తెలిపారు. ప్రతిమా లక్షణాలను బట్టి శిల్పకళా శైలిని బట్టి ఇది క్రీ. శ. 2వ శతాబ్దికి చెందినది అని శాతవాహన చక్రవర్తి హాలుని గాథాసప్తశతిలో గణపతి ప్రస్తావన వల్ల ఈ విగ్రహం చారిత్రక ప్రాధాన్యత దక్కించుకుందన్నారు.

మట్టితో చేసి కాల్చిన ఈ బొమ్మను పరిశీలించిన కరాట చిత్ర కళా పరిషద్, కళా విమర్శకులు ఆచార్య ఆర్. హచ్. కులకర్ణి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం శ్రీ రామోజు హరగోపాల్ ఇద్దరూ ఇది శాతవాహనుల కాలపు గణేశ ప్రతిమ అని ధ్రువీకరించారని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ అన్వేషణలో ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు నాగరాజు, స్థానికులు నాగేష్, చిత్తగిరి పాల్గొన్నారు, చారిత్రిక ప్రాధాన్యత గల ఈ ప్రతిమను, ఆలయ సముదాయం వద్ద రాబోయే ప్రదర్శనశాలలో భద్రపరుస్తామని, రఘువీరారెడ్డి తెలిపారు అని ఆయన అన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *