TT Ads

ఏప్రిల్ 01 ఖమ్మం: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్ లుగా రూపొందించి, ఏప్రిల్ నెల నుండి అమలు చేయాలనే మోడీ కుట్రలను ఏఐటియుసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహరావు, ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తీవ్రంగా ఖండించారు. ఖమ్మం జిల్లా ఉప లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట గురువారం నాడు ఎఐటియుసి ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి నాలుగు లేబర్ కోడ్ ల జీ.వో.ల కాపీలను చించివేసి దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చారు ఈ చట్ట సవరణలవల్ల కార్మికులు సాధించుకున్న 8 గంటల విధానం 12 గంటలు పని చేయాల్సి వస్తుందని కనీస వేతనాల హామి కనుమరు అవుతుందని కార్మికులు పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మారే పరిస్థితులు ఏర్పడతాయని అందువల్లే ఈ నాలుగు లేబర్ కోడ్ లను వ్వతిరేకిస్తున్నామని అన్నారు.

కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించు కున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా చట్టాలను సమూలంగా మార్చి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకురావడం సరైంది కాదని నాలుగు లేబర్ కోడ్ లు రద్దు అయ్యేవరకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐటియుసీ ఖమ్మం జిల్లా సమితి పోరాటం చేస్తుందని అన్నారు. పిఆర్ సిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్కార్మికులకు సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 61 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ తదితర పద్దతుల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది అందరికీ వర్తించేలా జి.ఓ.విడుదల చేయాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మున్సిపల్, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, ప్రాణాలకు తెగించి పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటియుసీ నాయకులు బిరెల్లి కృష్ణ,సాధు ఇజ్జగిరి, దాసరి గోపి,పి.శ్రీనివాస్,టి.వెంకటేశ్వర్లు,పి.వెంకన్న, ఆంజాద్ మియా, హెచ్.చిన్నా, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *