TT Ads

ఖమ్మం : రాష్ట్రంలో ఐదు మున్సిపాలిటీ తోపాటు రెండు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్ నామినేషన్లకు గానూ విధించిన సమయం సరిపోదని , ఈ గడువును కాస్తంత పొడిగించాలని బహుజన జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు . దీనివల్ల స్వతంత్ర అభ్యర్థులు అధిక సంఖ్యలో ఆశావాహులు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతారు అని ఆందోళన వ్యక్తం చేశారు . 16వ తేదీ నుంచి నామినేషన్ లు స్వీకరించి , 20 తేదీ స్క్యూటినిలు చేయటం ఆ తర్వాత 21వ తేదీన విత్ డ్రా, ప్రచారం ముగింపుకు28 వ తేదీ లో వ రుసగా గడువులు విధించడం పార్టీల అభ్యర్థులకు తప్ప ఇతరులకు ఇది ఇబ్బందికరంగా ఉందన్నారు.ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ , రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఉదృతి సమయంలో ఎన్నికలను పోస్ట్ ఫోన్ చేయడం గురించి ఆలోచించడం ఆహ్వానించదగ్గ అంశం అన్నారు . ఒకవేళ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించుకుంటే , మాత్రం నామినేషన్లకు గడువు కొద్దిగా పెంచాలని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *