TT Ads

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నాడు.నాపై అక్రమ కేసులు పెట్టి , భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడు.2012 మహబూబ్ నగర్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని… నాకు నాలుగు రోజుల క్రితం నాంపల్లి కోర్టు నుండి నాకు నోటీసులు వచ్చాయి.ఆ సభను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించింది…కేసు పెడితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పైననే పెట్టాలి.2012 లో జరిగిన ఘటనకు , 9ఏళ్ల తరువాత కేసు పెట్టించడంలో ముఖ్యమంత్రి భయం అర్థం అవుతుంది.న్యాయ వ్యవస్థ పట్ల నాకు నమ్మకం ఉంది ఆ దిశగా పోరాడుతాను,ఉద్యమ కారులను హింసించడం సరి కాదు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *