TT Ads

నగరంలో రోజు రోజుకు కరోనా వైరస్ ప్రభలుతుండుటంతో ఆటో డ్రైవర్ యూనియన్,వ్యపారస్తులతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చర్చించామన్నారునిబంధనల ప్రకారమే ఆటోల్లో ప్యాసింజర్లను ఎక్కించుకోవాలని సూచించారు.మార్కెట్ అసోసియేషన్ వర్తకులతో చర్చించి 9 ,10 ప్రదేశాల్లో డి సెంట్రలైజ్ చేశామన్నారుతిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఏకాంతంగా జరపాలని ఆలయ కమిటీకి సూచించారు.స్థానికులు ఎవరి ఇళ్ళలో వారే గంగ జాతర జరుపుకోవాలన్నారు.కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రజలంతా నిబంధనలను పాటిస్తే అరికట్టగలమన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సదుద్దేశంతో వ్యాక్సినేషన్ టీకా ప్రజలందరికి అందచేశారు,ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.టీ షాపుల వద్ద పిచ్చాపాటి ముచ్చట్ల కు ఇది సమయం కాదన్నారు,యువత కూడా బాధ్యత వహించి కరోనా కట్టడి చేసేందుకు కృషి చేయాలన్నారు.27వ తేదీ సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *