TT Ads

రౌతులపూడి: చనిపోయిన వ్యక్తిపేరిట ఉన్న భూమికి నకిలీ పాసుపుస్తకాలు సృష్టించి అమ్మకాలు చేసిన సంఘటన మండలంలోని దబ్బాది గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బాధితులు, అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన వంతల నాగయ్య 2003లో మరణించాడు. నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించి అతని పేరిట ఉన్న 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి విక్రయించారు.

గ్రామానికి చెందిన జగ్గారావు, బైరాగి, ప్రసాద్‌, సోమేశ్వరరావు, సత్తిబాబు తదితరులు తన భర్త పేరిట ఉన్న భూమిని నకిలీ పాసుపుస్తకంతో రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మేశారని వంతల చల్లయ్యమ్మ బుధవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. నాగయ్య, చల్లయ్యమ్మ ఫొటోలతో ఉన్న పాసుపుస్తకం చల్లయ్యమ్మ వద్ద ఉంది.

ఆన్‌లైన్‌లో మాత్రం భూమి నాగయ్య పేరిట ఉంది. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ ఆధార్‌, పాసుపుస్తకాలతో ఇద్దరి వ్యక్తుల పేరిట భూమి రిజిస్ట్రేషన్‌ చేశారు. అక్రమానికి పాల్పడ్డ వారిపై కోటనందూరు పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు పెడతామని తహసీల్దారు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *