TT Ads

రాచకొండ: బెంగళూర్ లో నకిలీ కంపెనీ లను సృష్టించడం., ఫేక్ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ లని ప్రజలను మోసం చేస్తున్న 3 గురిని అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.బెంగుళూరు కి చెందిన 1.అశోక్ కుమార్ అరుముగం (37) ,,2. కంచి సంజీవ్ కుమార్ (23),3.అసిమ్ అక్తర్ (34) లను అరెస్టు చేశారు.నిందితుల నుండి 3 CPU’S, 24 నకిలీ కంపెనీ రిజిస్టర్డ్ స్టాంపులు, 22 మొబైల్ ఫోన్స్, 14 బ్యాంకు ల చెక్ బూక్లు, అకౌంట్స్ సీజ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.హయత్ నగర్ కి చెందిన ఓ భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.బాధితురాలికి గత నెల 22 వ తేదీన వాట్సప్ కి హాంగ్కాంగ్ కి చెందిన నెంబర్ నుండి ఇవేస్ట్మెంట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ అని భాధితరాలికి మెస్సేజ్ వచ్చిందని, దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించిన సైబర్ నేరగాళ్లు..ఆ యాప్ ద్వారా 500 రూపాయలు రిచార్జి చేయాలని సూచించగా, ICICI బ్యాంక్ అకౌంట్ నుండి 500 రూపాయలు రిచార్జి చేసిన బాధితురాలు..బాధితురాలి వాట్సప్ నెంబర్ ని హాంగ్కాంగ్ గ్రూప్ స్ట్రాటజీ టీం యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు.

25 ఫిబ్రవరి లో సైబర్ నేరగాళ్ల కి 20 వేల రూపాయలు చేయాలని చెప్పగా, మీకు 30 వేల ప్రావిట్ చూపిస్తామని చెప్పారని.,24 ఫిబ్రవరి నుండి 15 మార్చి వరకు 20 లక్షల వారి అకౌంట్ లో వేసిందని, బాధితురాలి విన్బిజ్ ( Win Biz) అకౌంట్ లో 54 లక్షల 39 వేల 310 రూపాయలు చూపిస్తుందని, అయితే అకౌంట్ నుండి డబ్బులు డ్రా చేసుకుందామని చుస్తే blacked చూపిస్తుందని తెలిపిన సిపి.నకిలీ యాప్ ద్వారా ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా,ఫేక్ రిచార్జి అని చెబుతూ అమాయక ప్రజలకు మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల , ఆన్లైన్ పేమెంట్స్ లనుంది అప్రమత్తంగా ఉండాలని, గుడ్డిగా నమ్మవద్దని ప్రజలకు సూచించిన సీపీ..,సాంకేతికత పరిజ్ఞానం తో బెంగుళూరు లో 3 గురిని అరెస్ట్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు 3.5 కోట్ల రూపాయల ను వారి అకౌంట్స్ ని ఫ్రీజ్డ్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *