TT Ads

కర్నూలు జిల్లా లోని పలు ఆలయాల్లో హుండీలను ధ్వంసం చేసి నగదు,బంగారు నగలు,వెండి ని దోచుకెళ్లిన నిందితులను కర్నూలు పోలీసులు అందులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.కర్నూలు జిల్లా లోని గోనెగండ్ల, వెల్దుర్తి, హాలహర్వి పీఎస్ పరిధిలో ఉన్న పలు ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలపై ఉండే నగలు, పంచలోహ విగ్రహాలు, హుండీలను ధ్వంసం చేసి దోచుకెళ్తు జల్సాలకు పాల్పడుతున్నారు.

ఆలయాల్లో చోరీలకు పాల్పడే నిందితులందరు కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్దనుండి సుమారుగా 16 లక్షల నగదుతో పాటు,29 తులాల బంగారు నగలు,పంచ లోహ విగ్రహాలు,ఒక బైకును కూడా స్వాధీన పర్చుకొని రిమాండుకు తరలించారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులకు జిల్లా SP కాగినెల్లి పక్కిరప్ప అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ని ఆరు ఆలయాలలో,ఒక ఇంట్లో చోరి కి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో సీసీ కేమారాలే ప్రధాన పాత్ర పోషించాయని ప్రతి చోట సీసీ కెమెరాలను అమార్చుకోవాలని జిల్లా sp సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *