TT Ads

కరోన సెకండ్ వేవ్ రెండోవ దశలో ఉన్న దేశంలో ప్రస్తుతం ప్రళయం సృష్టిస్తుందని దీనిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని నంగార భేరి LHPS రాష్ట్ర ఉపాధ్యక్షులు , తెలంగాణ బహుజన జెఎసి బహుజనల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బానోతు భద్రునాయక్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు .అదే విధంగా మహారాష్ట్ర తర్వాత ఆ స్థాయిలో కరోనా రోగులు సంఖ్యలలో రోజురోజుకీ త్రీవంగా పెరుగుతున్నాయని పేద మధ్యతరగతి కుటుంబాలకు ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమత లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు కరోనాను ఆరోగ్యశ్రీ పథకం లోకి చేర్చాలని దీని వల్ల కరోనా వైద్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నంత వరకు అధిక ప్రాణనష్టం జరగకుండా ఆపవచ్చుని అన్నారు.

అదే విధంగా ప్రతి పంచాయతీ కేంద్రాల్లో కరోనా టెస్టులకు ప్రతి పంచాయతీ స్థాయిలో విభాగల మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేసి నియంత్రణ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని ప్రజలకు ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా మాస్కులు , శాని టైజర్లు , భౌతిక దూరని పాటిస్తూ వారి పనులను చేసుకోవాల్సిందిగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజ్ఞప్తి చేయాలని కోరారు . హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాని పక్షంలో , కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చని నేపధ్యంలో కార్పోరేట్ ఆసుపత్రుల దోపిడీ విపరీతంగా పెరిగే అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదనను వ్యక్తం చేశారు . ప్రజలకు కరోనా ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *