TT Ads

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ల దాఖలు కాలపరిమితి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గతేడాది మార్చి ఆదేశాలను పొడిగించాలని కోర్టు నిర్ణయించింది. కరోనా దృష్ట్యా వ్యాజ్యాల దాఖలు కాలపరిమితి పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఏవోఆర్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం పిటిషనర్లకు ఇబ్బంది లేకుండా తదుపరి ఆదేశాల వరకు వ్యాజ్యాల కాలపరిమితి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *