TT Ads

విశాఖపట్నం : ఎప్రిల్ 3, గుండెపోటుతో ఇటీవల మరణించిన 61వ జివిఎంసి కార్పొరేటర్ దాడి సూర్యకుమారి కుటుంబానికి పార్టీ,ప్రభుత్వం అండగా ఉంటుందని ఉత్తరాంధ్ర వైఎస్సార్ పార్టీ ఇంచార్జీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. సూర్యకుమారి కుటుంబ సభ్యులు మాల్కాపురం ప్రాంతంలోని రామకృష్ణాపురంలో వారి స్వగృహంలో కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వం సూర్యకుమారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఎర్పాటు చేసిన సంతాప సభలో సూర్య కుమారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చించి సూర్యకుమారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు. ఎంతో ప్రజా సేవా చెయ్యాల్సిన సూర్యకుమారి అకాలమరణం బాధాకరమని, పార్టీ కి, తమకు తీరని లోటు అని అన్నారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటారని,ఈ పారిశ్రామిక ప్రాంతంలో సూర్యకుమారి కుటుంబం ప్రజల మన్ననలు పొందిందని ఆయన కొనియాడారు. సూర్య కుమారి భర్త సత్యనారాయణ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రజా సేవలోనే చనిపోవాలని కోరుకుంటారని,రాజకీయాల నుండి రిటైర్ కావాలని ఎవరు కోరుకోరని, ప్రజా సేవలోనే ఆత్మ సంతృప్తి పొందుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి సత్యవతి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జివిఎంసి మేయర్ గొలగాని వెంకట హరికుమారి,వైఎస్సార్ పార్టీ నాయకులు మళ్లా విజయప్రసాద్,రెహ్మాన్, వరుదు కళ్యాణి,తైనాల విజయకుమార్,వంశికృష్ణయదవ్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *