TT Ads

ఖమ్మం మార్చి 1 : తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం 7 సభను జయప్రదం చేయాల్సిందిగా ఆ సంఘం విశిష్ట , గౌరవ అధ్యక్షులు ఎస్.కె. హుస్సేన్ ,
షేక్ హుస్సేన్ లతోపాటు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ నజీరుద్దిన్ , ప్రధాన కార్యదర్శి షేక్ జానీమియాలు పిలుపునిచ్చారు . సోమవారం ఖమ్మం నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు . ఖమ్మం ఆర్టిఏ ఎదురుగా గల అశోక మిని ఫంక్షన్ హాలులో ఈ మహాసభ జరగనుందని తెలిపారు . ఈ నెల 9వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ మైనార్టీ గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా ఏడవ మహాసభ భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ప్రకటించారు . ఈ మహాసభకు జిల్లా నలుమూలల నుండి గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి , విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు . మహాసభలో గత సంవత్సరం చేసిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను గురించి చర్చలు , తీర్మానాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు వెల్లడించారు . ఈ సమావేశంలో నాయకులు ఖలీల్ , అమీర్ జానీ , నన్నే సాహెబ్ , రమణ గుట్ట ఖాసిం , మహమ్మద్ అలీసాబ్ , ఇమామ్ , రంజాన్ , మోహిని, మియా సాహెబ్ , చాంద్ పాష ,బాబుసాబ్ తదితరులు పాల్గొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *