TT Ads

రాష్ట్రంలో రేపటి నుంచి విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, విద్యాసంస్థల్లో గత కొద్దిరోజులుగా భారీ సంఖ్యలో విద్యార్థులు, టీచర్లకు కరోనా సోకుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యాసంస్థలు మినహా అన్ని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. గురుకురాలతో పాటు అన్ని హాస్టల్స్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ క్లాసులు యథావిధిగా జరుగుతాయని, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విద్యాసంస్థల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతుండటంతో.. తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. విద్యాసంస్థలను మూసివేసే అంశంపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుపుతోంది. విద్యాసంస్థలను మూసివేయాలని వైద్యశాఖ చేసిన సిఫార్సుపై చర్చించిన అనంతరం.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చివరికి విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు ప్రకటించింది.

ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యాసంస్థలను మూసివేసే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం కేసీఆర్ ఆదేశాలతో విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *