TT Ads

తెలంగాణలో కరోనా రెండో దశ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు కాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7000లకు చేరువైంది.శుక్రవారం 59,705 కరోనా పరీక్షలు నిర్వహించగా1,078 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,900గా ఉన్నట్లు ప్రభుత్వం బులిటెన్‌ విడుల చేసింది.

తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా.ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 283 కరోనా కేసులు నమోదయ్యాయి.మిగతా జిల్లాల్లోనూ కరోనా తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *