TT Ads

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకరంగా మారుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,446 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది‌ . రాష్ట్రంలో నిన్న కరోనాతో 12మంది మరణించగా.ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,802కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 33,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 598 కేసులు నమోదయ్యాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *