TT Ads

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా వైరస్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిలో 35మంది వైరస్‌తోచనిపోయారు సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి.. అంటే కేవలం 15 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆస్సత్రిలో మరికొందరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరుతున్నారు. అలాంటి వారే కరోనాతో చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులూ తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్నవారూ ఉన్నారు. ఇలా కారణాలేవైనాగానీ.. ఆ ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం వినిపిస్తోంది. అయితే ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన 35 మందిలో 45, ఆలోపు వయసువారు తొమ్మిది మంది ఉన్నారు. మిగతావారంతా 46 నుంచి 83 ఏళ్ల వారు. ఈ 35 మందిలో 16 మంది మహిళలు , 19 మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం గాంధీలో 308 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *