TT Ads

గొల్లపూడి: విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్‌ఫైర్‌ అయిన ఘటనలో ఓ హోంగార్డు భార్య మృతి చెందారు. ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ ఇంటి నుంచి హోంగార్డు వినోద్‌కుమార్‌ తుపాకీని తన నివాసానికి తీసుకొచ్చారు. కూరగాయలతో పాటు పొరపాటున హోంగార్డు తుపాకీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం తుపాకీని బీరువాలో పెట్టమని భార్యకు చెప్పాడు. ఈ క్రమంలో తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో హోంగార్డు భార్య సూర్యరత్న ప్రభ అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం అదనపు ఎస్పీ వద్ద వినోద్‌కుమార్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గొల్లపూడి మౌలానగర్‌లో హోంగార్డు కుటుంబం నివాసం ఉంటోంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *