TT Ads

విశాఖ:విశాఖ శారదా పీఠాధిపతి, తిరుమలేశుని ప్రధాన అర్చకుడు పోటీపడుతూ ముఖ్యమంత్రిని ఒకరు తన ఆత్మ అంటే, మరొకరు శ్రీవిష్ణువు అంతటివాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే చాలా ముచ్చటేస్తుంది.ఒకప్పుడు రాజుల కాలంలో ఇలా పొగడడానికే కొంత మంది ఉండేవారని పురాణ గాథలు విన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా విని, చూసి, తరించే భాగ్యం నేటి తరానికి లభించింది. అందుకు సంతోషిస్తున్నా.పొగడ్తలతో ఇతరులను కీర్తించేవారు తప్పనిసరిగా పచ్చి అవకాశవాదులు, స్వార్థపరులై ఉంటారు. అందులో ఏ మాత్రం అనుమానం లేదు.సమాజానికి హేతువాదులు చేయలేని గొప్ప సేవను ఈ తరహా పీఠాధిపతులు, పూజారులు చేస్తున్నందుకు అభినందిస్తున్నా

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *