TT Ads

తిరుపతి “మున్సిపాలిటీ 135 వ ఆవిర్భావ దినోత్సవ” సందర్భంగా తిరుపతి స్థానిక హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి తిరుపతి ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు!
తిరుపతి ఓ కుగ్రామం నుంచి పట్టణంగా,నగరంగా మహా నగరంగా రూపాంతరం చెంది మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థ స్థాయికి రావడానికి కృషి చేసిన తిరుపతిలోని ఎందరో మహనీయులు “చైర్మన్”లు కౌన్సిలర్ లు అధికారులు సిబ్బంది సేవలు చిరస్మరణీయం నగర అభివృద్ధికి నిజాయితీగా వారు చేసిన కృషి చారిత్రాత్మకం!

తిరుపతి నగర అభివృద్ధికి కృషి చేసిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల ను అధికారులను సిబ్బందిని ఆదర్శంగా తీసుకొని నేడు నగరపాలక సంస్థకు నూతనంగా ఎన్నికైన”మేయర్””కార్పొరేటర్లు” నిస్వార్థంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి నిధుల దుర్వినియోగం కాకుండా ప్రజలపై స్థానిక వ్యాపారస్తుల పై అనవసరమైన పన్నుల భారం మోపకుండా స్మార్ట్ సిటీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిని “మహానగరంగా”అభివృద్ధి చేస్తారని నగర ప్రజలు ఆశిస్తున్నారు

తిరుపతిలో “భూ కబ్జాదారుల” “అసాంఘిక శక్తుల” రౌడీ మూకల కబంధహస్తాల నుంచి తిరుపతి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత నగరంలోని యువతీ యువకులతో సహా అన్ని రాజకీయ పార్టీలు,విద్యా,వ్యాపార వేత్తలతో పాటు మేధావులు రచయితలు ప్రజాసంఘాల పై వుంది వీరంతా సమాజ హితం కోసం కదం తొక్కాలి

తిరుపతి ని పూర్వం రామానుజపురం,గోవిందరాజపురం అని పిలిచేవారు ఆ తర్వాత తిరుపతి అనే పేరును శ్రీ రామానుజాచార్యుల వారే పెట్టారని చరిత్ర చెబుతున్నది!5) బ్రిటిష్ వారి కాలంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చిన్న మున్సిపాలిటీగా ఏర్పడి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తిరుమల శ్రీ వారి ఆశీస్సులతో టీటీడీ సహకారంతో తిరుపతి నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది

తిరుపతి అంటే నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక రాజధాని గా విద్యా వైద్య రంగాలలో కులమతాలకు అతీతంగా ఎంతో అభివృద్ధి సాధించడం శుభపరిణామం తిరుపతి స్ధానికులు నవీన్ కుమార్ రెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *