TT Ads

తిరుపతిలో సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి తిలక్రోడ్డు,కర్ణాలవీధి,బేరివీది,గాంధీరోడ్ లలో పర్యటిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ కు ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంచుతున్న పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

తిరుమల శ్రీవారి దర్శనం “స్థానికులకు” ప్రతి నెల మొదటి మంగళవారం ఎటువంటి సిఫార్సు లేఖలు లేకుండా కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నేడు ప్రతి ఒక్కరూ దర్శించుకోవడం కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఆధ్వర్యంలో తామంతా చేసిన పోరాట ఫలితమే.తిరుమల తిరుపతి దేవస్థానం, నగరపాలక సంస్థ,విద్యుత్ శాఖ లతోపాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగ భద్రత,జీతాల పెంపు కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది,బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్,పెట్రోల్, డీజిల్,నిత్యావసర వస్తువుల దరలకు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీ కి ఉద్యోగస్తులు తమ ఓటు ద్వారా గుణపాఠం నేర్పాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *