TT Ads

డి‌జి‌పి కార్యాలయం: ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలను తీసుకున్నాము. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు భారీగా 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో ఈ ఎన్నికల్లో కట్టు దిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సరిహద్దులలో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపాము.ఇప్పటి వరకు 33,966 మందిని బైండ్ ఓవర్ చేయగా76,04,970 లక్షల రూపాయల నగదును సీజ్ 6884 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి94 వాహనాలను జప్తు చేసాం.ఉద్దేశ్యపూర్వకంగా శాంతి భద్రత లకు భంగం కలిగిస్తారనే సమాచారం మేరకు అనుమానితులపైన నిరంతర నిఘాను ఏర్పాటు చేశాము. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఏ సమస్య ఉత్పన్నమైన తక్షణమే డయల్ 100, 112 ద్వారా పోలీసు కు సమాచారం అందివ్వాలని ప్రజలను కోరుతున్నాము .ఇప్పటికే చాలామంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాసామ్య పరిరక్షణ లో తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *