TT Ads

తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రెండు నాటు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఈ ఘటనలో ఓ శునకం, వరాహం మృతి చెందాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే క్యాంపస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని అనుమానంతో క్షుణ్ణంగా గాలించారు.యూనివర్సిటీలో అడవి పందులను వేటాడేందుకే వేటగాళ్లు నాటు బాంబులను పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *