TT Ads

అసలు ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీకి ఉందా,రెండేళ్లలో ప్రజలకు ఏం మేలు చేశారని వైసీపీకి ఓటెయ్యాలి,జగన్ లేఖ రాయాల్సింది ప్రజలకు కాదు. ప్రధాని మోదీకి మీకు దమ్ముంటే ప్రత్యేకహోదా,విభజన సమస్యలు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి వాటిపై మోదీని నిలదీయాలి వైసీపీకి ఓటెందుకు వెయ్యాలో జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలిరెండేళ్లలోనే ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపినందుకా రైతు రుణమాఫీని రద్దు చేసినందుకా మోటార్లకు మీటర్లు పెడుతున్నందుకా నివార్‌ తుఫాన్‌లో ధాన్యం కొనుగోలు చేయనందుకా ఉచిత ఇసుక రద్దు చేసి ఇసుక రేట్లు 4 రెట్లు పెంచి, 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతీసినందుకా మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యం పోసి పేద ఇళ్లు కొల్లగొడుతున్నందుకా రూ.25 వేల కోట్లు జె-ట్యాక్స్‌ దండుకొంటున్నందుకా 6 లక్షల మంది యువతకిస్తున్న నిరుద్యోగభృతి రద్దు చేసినందుకా కేసుల మాఫీ కోసం 28 మంది ఎంపీలను కేంద్రానికి తాకట్టుపెట్టినందుకా నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసినందుకా అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి నాన్న బుడ్డిలో రూ.36 వేలు కొట్టేసినందుకా సెంటు పట్టా పేరుతో రూ.6,500 కోట్లు అవినీతి చేసినందుకా? ఒక్క గృహం నిర్మించనందుకా? చంద్రబాబు నిర్మించిన 10 లక్షల ఇళ్లను శిధిలంగా మార్చినందుకా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కోత కోసి 16,800 పదవుల్ని బీసీల నుండి లాక్కొన్నందుకా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లు నీరుగార్చినందుకా మైనారిటీ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కార్పొరేషన్లకు నిధు కోతకోసినందుకా ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వనందుకా బలిజ రిజర్వేషన్లు రద్దు చేసినందుకా విదేశీ విద్యోన్నతి రద్దు చేసినందుకా ఫీజు రీయంబర్స్ మెంట్‌ పీజీ విద్యార్థులకు రద్దు చేసినందుకా కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ మీరు కొట్టేసే కుట్రలు చేస్తున్నందుకా కమీషన్ల కోసం పరిశ్రమలు తరిమేసినందుకా ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌లో అవినీతిని ప్రశ్నించిన పౌరుల పైన, పత్రికలపైన, ప్రతిపక్షాలపైన, రాజ్యాంగ సంస్థలపై దాడులు చేసినందుకా అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కాలతన్ని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నందుకా ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల్ని హరిస్తున్నందుకు వైకాపాకు ఓటు వేయాలా

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *