TT Ads

అమరావతి: తిరుపతి ఉపఎన్నిక రద్దుపై నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఉపఎన్నిక రద్దు చేయాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై డివిజనల్ బెంచ్‌ విచారణ చేపట్టాలని రత్నప్రభ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఉప ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ వేశామని, భాజపా, తెదేపా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కలిపి విచారించాలని తెదేపా తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై రిజిస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *