TT Ads

తిరుపతి:తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుందామన్న సవాల్‌కు బాబు తోకముడిచారు నాలుగు రాళ్ళు వేయించుకునైనా సరే నాలుగు ఓట్లు సంపాదించాలని బాబు చూస్తున్నాడు .చంద్రబాబు రాళ్ళ డ్రామా, లోకేష్‌ అలిపిరి ప్రమాణాల డ్రామాలు అందుకే.శ్రీ వైయస్ జగన్ బొమ్మ, ఆయన చేసిన అభివృద్ధే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తుంది.టిడిపి, బిజెపిలు ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతాయి.

మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి:తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం ఓటమి చాలా స్పష్టంగా కనిపిస్తోందని, ఓటమి భయంతో చంద్రబాబు పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను సీఎం శ్రీ వైయస్ జగన్ పాలనపై రెఫరెండంగా తీసుకుందామని మేం చేసిన సవాల్‌ కు చంద్రబాబు తోకముడిచి పారిపోయారన్నారు. ఒక జాతీయ పార్టీగా వున్న బిజెపి నోటా కన్నా ఎక్కువ ఓట్లు వస్తే చాలు అని తంటాలు పడుతోందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.

తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే … వైయస్‌ఆర్‌సిపి ఎంపీలు రాజీనామా చేస్తారు… మా అభ్యర్థి గెలిస్తే టిడిపి ఎంపీలతో రాజీనామా చేయిస్తావా అన్న ప్రశ్నకు చంద్రబాబు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా పూర్తవుతోంది. ఇప్పటి వరకు మేం చేసిన సవాల్‌ను స్వీకరించే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేదు. అంటే ఓటమిని అంగీకరిస్తున్నాడనేగా అర్థం. ఈ సవాల్‌కు జవాబు చెప్పకుండా తనపై రాళ్ళ వర్షం అంటూ చంద్రబాబు, అలిపిరి లో ప్రమాణం పేరుతో లోకేష్‌లు డ్రామాలు ఆడుతున్నారు. కనీసం తనపై నాలుగు రాళ్ళు వేయించుకుంటే అయినా.. సానుభూతితో నాలుగు ఓట్లు పడతాయని చంద్రబాబు హైడ్రామా సృష్టించాడు.

చంద్రబాబు తనపై రాళ్ళవర్షం అన్నాడు. సిసి కెమేరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఎవరూ రాయి విసరలేదని నిర్ధారణ అయ్యింది. తనపై రాళ్ళు వేశారని చెప్పుకుని, సానుభూతి పొంది, నాలుగు ఓట్లు వేయించుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు. అధికారపార్టీ దౌర్జన్యం చేస్తోందనే తప్పుడు ప్రచారం చేసేందుకే ఇటువంటి డ్రామాలు చంద్రబాబు ఆడుతున్నారు.

చంద్రబాబు డ్రామాలకు ప్రజలు మోసపోయే రోజులు పోయాయి. మేం ఓట్లు అడిగేందుకు చాలా ధైర్యంగా వున్నాము. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా అద్భుతమైన పాలనను అందిస్తున్న శ్రీ వైయస్ జగన్ గారికే తిరుపతి ఓటర్లు అండగా నిలుస్తారు. ఎక్కడకు వెళ్ళినా మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని, సంక్షేమాన్ని ప్రజలుకు వివరిస్తున్నాం. కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలు, రాళ్ళవర్షం డ్రామాలు, అలిపిరి ప్రమాణాల నాటకాలతో ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తావు చంద్రబాబూ

అసలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆ పార్టీ గురించి, మీ కొడుకు లోకేష్ గురించి ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలు చూశారు. చంద్రబాబు, లోకేష్ ల వల్లే పార్టీ మొత్తం నాశనమైందని టిడిపి కార్యకర్తలే ఆవేదనతో వున్నారు. రేపో, మాపో పార్టీ మూసేసే పరిస్థితి వుంది. పార్టీనే కాడుకోలేని మీరు, తిరుపతి ప్రజలకు టిడిపి అభ్యర్థికి ఓటు వేయమని ఎలా అడుగుతావు చంద్రబాబూ? ఓట్లు అడిగే అర్హత, హక్కు చంద్రబాబుకు లేదు.

చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల పాలన కంటే.. సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ఇరవై రెండు నెలల పాలన ప్రజల్లో మంచి ఆదరణను తీసుకువచ్చింది. ఓట్లరు కూడా వైయస్‌ఆర్‌సిపికి అనుకూలంగా వున్నారు. సీఎం జగన్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు, సేవలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్దంగా వున్నారు. మా పార్టీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్లు అంటూ మరో కొత్త ఎత్తుగడను చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చాడు. ఎక్కడా దొంగ ఓట్లు లేవు, అటువంటివి జరిగితే మేం బాధ్యత వహిస్తాం, గాలి వార్తలు ప్రచారం చేసేవారు, ఆ వార్తలను పోగేసి ఓ వర్గం మీడియాలో వండి వార్చేవారు చర్యలకు సిద్ధమా?

తిరుపతి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే మాకు దాదాపు ఆరు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నాము. చంద్రబాబు తన పర్యటనలో కరెంటు తీసేశారని, రాళ్ళదాడి చేశారంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడు. అటువంటివి చంద్రబాబుకే అలవాటు. ఆయనలా వెన్నుపోటు రాజకీయాలు మేం చేయలేము. ఆయన చేసే తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైయస్‌ఆర్సిపి దౌర్జన్యం చేస్తోందని అబద్దాలు ప్రచారం చేసుకుని లబ్ధిపొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.

పారామిలటరీ బలగాలను తీసుకురావాలని చంద్రబాబు అంటున్నాడు. ఆయన మాదిరిగా మా పార్టీ నుంచి గెలిచిన కార్పోరేటర్లు, ఎంపిటిసి, జెడ్పీటిసిలను బలవంతంగా తీసుకుని తన పార్టీ వారికి పదవులు దక్కేలా మేం చేయలేదు. చంద్రబాబులా అనైతిక రాజకీయాలు చేయడం మాకు చేతకాదు. అటువంటి నీచసంస్కృతికి సీఎం శ్రీ వైయస్ జగన్ గారు పూర్తి వ్యతిరేకం. టిడిపి, బిజెపిల తరఫున స్టార్‌ క్యాంపెయినర్లు ఎంతమంది వచ్చి ప్రచారం చేసినా.. మాకు కేవలం సీఎం జగన్ గారి బొమ్మ చాలు ప్రజల నుంచి ఆదరణ రావడానికి. ప్రజలు మా పక్షాన వున్నారనేది మా విశ్వాసం. అందుకే గతం కంటే మంచి మెజార్టీ సాధిస్తాం.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *