TT Ads

అమరావతి: తమ ప్రభుత్వ పాలనలో మహిళా సాధికారత కల్పించామని ఏపీ సీఎం జగన్ అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా సీఎం జగన్ విడుదల చేశారు. దీనివల్ల 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ. 1,109 కోట్లు జమకానున్నాయి. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తూ, తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సీఎం అన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందజేసి మహిళా సాధికారతను ఆచరణలోకి తీసురాగలిగామని సీఎం జగన్ తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *