TT Ads

విజయవాడ, మే 7: తమిళనాడు సీఎం గా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అభినందనలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్న తొలిసారిగా తమిళనాడులో ఆవిష్కరించినది వీరి తండ్రిగారైన స్వర్గీయ శ్రీ కరుణానిధి అని ప్రశంసించారు. ప్రతిపక్ష పార్టీలకు గట్టిపోటీ ఇచ్చి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల మన్ననలను పొందిన శ్రీ స్టాలిన్ ప్రజలకు మంచి సుపరిపాలన అందించి వారి మన్ననలు పొందాలని ఆశిస్తూ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడుగా మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఎస్ విజయచందర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *