TT Ads

దేశంలో కశ్మీరులో ముఖ్యమంత్రులుగా ఉన్న షేక్‌ అబ్దుల్లా కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా, మనవడు ఉమర్‌ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ కుమార్తె మెహబూబా, ఒడిశాలో బిజూ పట్నాయక్‌ కుమారుడు నవీన్‌ పట్నాయక్, హరియాణాలో దేవీలాల్‌ కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌదాలా, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌ యాదవ్‌ కుమారుడు అఖిలేష్‌ యాదవ్, కర్ణాటకలో దేవేగౌడ కుమారుడు కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో 1952 నుంచి పనిచేసిన ముఖ్యమంత్రుల వారసులు సీఎంలు కాలేదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కుమారుడు రవీంద్రకుమార్‌ ఎంపీగా పనిచేస్తున్నారు. పళనిస్వామి కుమారుడు మిథున్‌ రాజకీయాల్లోకి రాలేదు. మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ బాధ్యతలు చేపడుతున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *