TT Ads

కాలం కాటేయ‌డం కామ‌న్. ప‌రిస్థితుల్ని ఫేస్ చేయొచ్చు.కానీ క‌రోనా కాటేస్తే క‌ష్టం. దాన్నుంచి త‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. పోయిన ఏడాది ప‌రిస్థితి ఎలా ఉందో .ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ప‌రిస్థితి అలాగే ఉంది. మ‌ధ్య‌లో క‌రోనా నుంచి ఈజీగా కోలుకుంటున్నా.ఇప్పుడు మాత్రం అలా కోలుకోవ‌డం లేదు. ఇప్పుడు కొత్త క‌రోనా వ‌చ్చి ప‌డ‌డంతో.క‌ష్టంగా మారింది. స‌చిన్ ప‌రిస్థితి కూడా అదే. ఆ మ‌ధ్య స‌చిన్ కి క‌రోనా వ‌చ్చింది అని తేలింది క‌దా. టెస్టుల్లో క‌రోనా బ‌య‌ట ప‌డ‌డంతో స‌చిన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో పాటు అభిమానులు అంతా ఏంట్రా బాబూ అనుకున్నారు. అయినా స‌చిన్ అంటే క్రికెట్ ప్లేయ‌ర్ స్పోర్ట్స్ పీపుల్ ఫిజిక‌ల్ గా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటారు కాబ‌ట్టి.స‌చిన్ కి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు కాబ‌ట్టి ఇట్స్ ఓకే ఓ వారం ప‌ది రోజులు.. రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుంది అనుకున్నారు.

కానీ క‌రోనా నిర్దార‌ణ అయింది మార్చి 27న. అంటే ఇప్ప‌టికి వారం రోజులు అవుతోంది. అంత‌కు ముందే క‌రోనా వ‌చ్చి ఉంటుంది. ఆ రోజు నిర్దార‌ణ అయింది. యాక్చువ‌ల్ గా రెగ్యుల‌ర్ క‌రోనా అయితే స‌చిన్ ఈ పాటికే కోలుకోవాలి. మామూలు జ‌నాలు కూడా కోలుకోవాలి. స‌చిన్ ఎందుకు కోలుకోరు చెప్పండి. ఫిజిక‌ల్లీ ఫిట్ గా ఉండే స‌చిన్ ఇప్ప‌టికే హెల్త్ సెట్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. అలాంటి సచిన్ ఆరోగ్య ప‌రిస్థితి ఇప్పుడు సీరియ‌స్ గా మారిందంట‌. అందుకే హోం క్వారంటైన్ నుంచి హాస్పిట‌ల్ కి షిఫ్ట్ చేశారు. మామూలుగా ఇంట్లో అయినా స‌చిన్ కి మంచి ట్రీట్మెంటే ఉంటుంది. డ‌బ్బుకి రెస్పెక్ట్ కి ఎలాంటి ప్రాబ్ల‌మ్ లేదు.అన్నీ ఎప్ప‌టిక‌ప్పుడు అవైల‌బుల్ ఉంటాయి. పెద్ద పెద్ద డాక్ట‌ర్లే అబ్జ‌ర్వ్ చేస్తుంటారు.అయినా త‌గ్గ‌లేదు హాస్పిట‌ల్ కి షిఫ్ట్ చేశారు అంటే ప్రాబ్ల‌మ్ పెద్ద‌దే అని ఆలోచ‌న‌లో ప‌డిపోయారు ఫ్యాన్స్.బ‌ట్స‌చిన్ మాత్రం ఐయామ్ ఓకే నో వ‌ర్రీ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుండ‌డంతో కాస్త ధైర్యంగానే ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *