TT Ads

తమిళనాడు ఎన్నికలకు ఏప్రిల్ 6 పోలింగ్ జరగనుండగా.. అన్ని ప్రధాన పార్టీలూ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువకూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా? పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా’ అని ఎన్నికల ప్రచారంలో రాజా ధ్వజమెత్తారు

డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించారు. తాను ఒక రైతు అని, ఒక పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానని ప్రజల్లోకి దీనిని బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *