TT Ads

ఖమ్మం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నారని అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారులు ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల సోమయ్య పిలుపునిచ్చారు . బుధవారం కెమిస్ట్రీ అండ్ డయాగ్నస్టిక్ భవనంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు .

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వేచ్ఛా సమానత్వం సమసమాజం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నిరంతరం పాడుపడిన మహనీయుడని , దార్శనీకుడని కొనియాడారు . ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ , సమానత్వం కల్పించాలని , బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ రాజ్యాంగం రచించడం జరిగిందన్నారు .ముఖ్యంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ ట్రీ అనుసరించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని , ఇదే ప్రజా స్వామ్య జౌనత్వం అని పేర్కొన్నారు.

అలాంటి ప్రజాస్వామ్య విలువలు కోల్పోయోల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు . మానవ స్వేచ్ఛా , స్వాతంత్య్రం ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఉద్యమకారులు , మేధావులు ప్రజాస్వామికవాదులు సంఘతితo కావాలని సూచించారు .ఈ కార్యక్రమంలో వివిధకుల , ప్రజా సంఘాల నాయకులు గుంతేటి వీరభద్రం ,పాల్వంచ రామారావు ,సంపత్ ,రామ్మూర్తి ,నరేందర్ ,భద్రునాయక్ , లిక్కీ కృష్ణారావు ,సోమరాజు,శ్రీనివాసరావు ,చౌహాన్ ,శ్రీనివాస్ నాయక్ , రాంబాబునాయక్ ,సతీష్ ,శంకర్ రావు, గంగాధర్ ,జానీ,షేక్ నజీమ్,నాగార్జున,అఖిల్,మురళీ ,శ్రీనివాస్ , సంగమేశ్వరరావు,ప్రసాదు ,లింగాల రవి తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *