TT Ads

తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం , వరంగల్ , నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ కి ఎందుకు ఓటు వేసి గెలిపించాలి అనే విషయాన్ని పట్టభద్రులు అంతా ఆలోచించి ఇతర అభ్యర్థులకు మరియు డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మధ్య గల తేడాను తెలుసుకొని , తమకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్య విజ్ఞప్తి చేశారు . బుధవారం ఖమ్మం నగరంలో డాక్టర్ చెరుకు సుధాకర్ విజయాన్ని కాంక్షిస్తూ… ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులు మరియు విద్యా సంస్థలలో ఓట్లను అభ్యర్థించారు . నీతి , నిజాయితీ , నిబద్ధతలు తన 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులు అని తెలిపారు . అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తన ఆరేళ్ల పదవీ కాలంలో నిరుద్యోగులకు , పట్టభద్రులకు చేసిందేమీ లేదని , మండలిలోనూ ఏ సమస్య పై నోరెత్తలేదని , ఇదే విషయంపై ఆ పార్టీలో పలువురు నాయకులు , కార్యకర్తలు విమర్శిస్తున్న విషయాన్ని ఎత్తిచూపారు .ఇదే విధంగా స్థానికత లేకపోయినా, ఇక్కడ పోటీ చేయటంపై పలువురు విమర్శిస్తున్నా కూడా , కోదండరాం రెడ్డి గారు బరిలో ఉండటంపై గల ఆంతర్యం గ్రహించాలని సూచించారు . అదేవిధంగా తీన్మార్ మల్లన్న , రాణి రుద్రమ రెడ్డి , జయసాయి రెడ్డిలు కేవలం జర్నలిస్టులు మాత్రమే , వారేమీ ఉద్యమకారులు కాదని , తెలంగాణ కోసం ఉద్యమించి , పీడీ యాక్ట్ మోపబడి సంవత్సరంపాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి డాక్టర్ చెరుకు సుధాకర్ గారు మాత్రమే అని తెలిపారు . తాము ఓడిపోతామని తెలిసినా ఒక సామాజిక వర్గం నాయకులంతా పోటీకి దిగడం వెనుక తమ సామాజికవర్గంకు చెందిన అధికార పార్టీనేతను గెలిపించాలనే కుట్ర ఉందని విమర్శించారు . నిరుద్యోగులు , పట్టభద్రులు ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రజాస్వామిక వాదులు , తెలంగాణ ఉద్యమకారులు , డాక్టర్లు , జర్నలిస్ట్లు , లాయర్లు , ఇంజనీర్లు , వంటి మేధావులంతా ఈ వాస్తవాలను విశ్లేషించి , మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ రధసారధిగా ఉండి తెలంగాణ రాష్ట్రం సిద్ధించేవరకు అలుపెరుగనిపోరాటం చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారికే మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించాలని ఖమ్మం జిల్లా పట్టభద్రులను అభ్యర్ధించారు . మరోసారి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే , విద్యను మరింత వ్యాపారం చేసుకోవటంతోపాటు మరో యూనివర్సిటీని సాధించుకుంటారన్నారు . ఇక్కడి సమస్యల పట్ల ఏమాత్రం అవగాహనలేని , స్థానికేతర వ్యక్తిని గెలిపిస్తే , అతడు చేసే అభివృద్ధి ఏమీ ఉండదని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో బహుజన జేఏసీ చైర్మన్ డాక్టర్ కె. వి .కృష్ణారావు ఎస్సీ , ఎస్టీ , హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంతేటి వీరభద్రం , తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ , ద్రావిడ బహు జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెకూరి చైతన్య , లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , తెలంగాణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లిక్కీ కృష్ణారావు , తెలంగాణ జే. ఏ .సీ. జిల్లా అధ్యక్షులు పులిపాటి ప్రసాద్ , సకల జనుల సమితి ఉమ్మడి జిల్లా బాధ్యుడు తీగలరాము , సంచారజాతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లెపూ సోమరాజు , బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవరావు , రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఉబ్బన , తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు కల్వకుంట్ల లతా , బైరం వరలక్ష్మి , వడ్డెబోయినవెంకటేశ్వర్లు , ఇరిగి ఉజ్వల , తీగల రాములు , రవీందర్ , మేఘన , నంగారా బేరీ జిల్లా అధ్యక్షుడు బూక్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *