TT Ads

ఖమ్మం, మార్చ్8: ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతును ఇచ్చి ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటుందని ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈరోజు ఖమ్మం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్ జిల్లా అత్యవసర సమావేశానికి జాతీయ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ… దళిత, బడుగు, బలహీన వర్గాల హక్కులకోసం నిరంతరం శ్రమించి, తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమంలో చిరస్మరణీయమైన పాత్ర పోషించిన డాక్టర్ చెరుకు సుధాకర్ గారి గెలుపు అణగారిన వర్గాల ఐక్యతకు చిహ్నంగా మారుతుందని, ఆయన గెలుపుకు ఎంఆర్పిఎస్, ఎం ఎస్ ఎఫ్, ఎన్ హెచ్ పి ఎస్, మాదిగ గ్రాడ్యుయేట్స్ ఇంటింటికీ వెళ్లి ఉద్యోగులను, నిరుద్యోగులను చైతన్యం చేసి డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రెండవ ప్రాధాన్యత ఓటును గిరిజన నాయకుడు శ్రీ రాములునాయక్ గారికి వెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య మాట్లాడుతూ… పేద ప్రజల పక్షపాతి, నిరంతర శ్రమ జీవి డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు, కొలికపోగు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బచ్చలకూర వెంకటేశ్వర్లు, పగిడికత్తుల ఈదయ్య, యువసేన రాష్ట్ర నాయకులు మాచర్ల క్రాంతి, వి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు జీవ, సురేష్ లు ప్రసంగించగా, జిల్లా నాయకులు కందుల బాబు, చింతిరాల నాగభూషణం, కె వెంకట్రావు, పి ప్రభాకర్, వి శ్రీను, కె.రోశయ్య, ఆర్ దాసు, చిన్ని శ్రీను, తూరుగంటి రాము, దుడ్డెల్లి సైదులు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, వెంకన్న, హనుమంతు, కృష్ణ మరియు అన్ని మండల కమిటీలు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *