TT Ads

అమరావతి:జగన్ అనాలోచిత చర్యలపై రాష్ట్రంలో విజృంభిస్తున్న సెకండ్ వేవ్.30శాతానికి చేరిన పాజిటివిటీ రేటు.సగటున రోజుకు 20వేలకు పైగా కేసులు.ముంచుకొస్తున్న బ్లాక్ ఫంగస్ ముప్పు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం.ఇప్పటికీ ఆక్సిజన్ కు వెదుకులాటే.వ్యాక్సినేషన్ లో ఘోరవైఫల్యరాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత చర్యల కారణంగా కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపుతోంది.ఒకవైపు కరోనాతో జనం కకావికలమవుతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కక్షతీర్చుకునే పనిలో నిమగ్నం కావడం విచారకరం.ఈనెల 16వతేదీన రికార్డుస్థాయిలో 24వేల 171 కేసులు నమోదుకాగా, పొరుగున ఉన్న తెలంగాణాలో కేవలం 3,816 కేసులు మాత్రమే నమోదు కావడాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.అనంతపురం జిల్లాలో కోవిద్ కేర్ సెంటర్ల పర్యవేక్షణ కోసం నియమితులైన ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక అధికారి సుబ్బరాయుడు ఆక్సిజన్ బెడ్ దొరక్క మృతిచెందిన ఘటన హృదయాన్ని కలచివేస్తోంది. సుబ్బరాయుడు కుమారుడు తమ తండ్రిని భుజాలపై మోసుకొని వెళ్లి ఆక్సిజన్ అందించాలని చేతులు జోడించి మొక్కినా అక్కడి వైద్యులు పట్టించుకోకపోవడంతో ఊపిరాడక మృతిచెందారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *