TT Ads

శేషాచలం అడవుల్లో కి ప్రవేశిస్తున్న 14 మంది స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అనంతపురం రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు సిఐ వెంకట రవికి అందిన సమాచారం మేరకు ఆదివారం నుంచి పనపాకం నుంచి ఐతే పల్లి అటవీ ప్రాంతంలో ఆర్ ఎస్ ఐలు వాసు, సురేష్ డీఆర్వో నరసింహ రావు టీమ్ కూంబింగ్ చేపట్టినట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఆదివారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టినట్లు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 14 మంది బ్యాగ్ లలో నిత్యావసర వస్తువులు పెట్టుకుని అడవుల్లోకి ప్రవేశించారు. అటవీ ప్రాంతంలో కి వచ్చిన తరువాత వారిని చుట్టుముట్టినట్లు తెలిపారు. వీరి నుంచి బియ్యం, బేకరీ వస్తువులు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు తమిళనాడు లోని తిరువన్నామలై జిల్లా జమునా మత్తూరు ప్రాంతంలోని జవ్వాది మలై కు చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. వీరిని పంపిన వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు. వీరిని అడవుల్లోకి వెళ్లకుండా నియంత్రించడం వల్ల కొన్ని వందల ఎర్రచందనం చెట్లను కాపాడ గలిగామని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ ఐ భాస్కర్, సిఐలు వెంకట రవి, చంద్రశేఖర్, ఆర్ ఐలు వాసు, సురేష్, లింగాధర్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *