TT Ads

ముల్కీ నిబంధనల రద్దు ముఖ్యమా? ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? అని అడిగితే ముల్కీ నిబంధనల రద్దే ముఖ్యమన్న తెలుజాతి ముద్దు బిడ్డ.జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన యోధుడు.1938 లోనే రైతుల కష్టాల పై సిక్కోలు నుండి చెన్నపట్నం(చెన్నై) వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ రైతు రక్షణ మహా పాదయాత్ర చేసిన రైతు బాంధవుడు భారత దేశంలో సర్దార్ బిరుదాంకితులలో ప్రముఖుడు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు స్వర్గీయ సర్ధార్ గౌతు లచ్చన్న గారి వర్దంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ.

సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం పై ఒక విశ్లేషణాత్మక సమచారం:జననం: ఆగస్ట్-16,1909 ,స్థలం: నాటి గంజాం జిల్లా&,నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం,బారువ అనే గ్రామంలో తల్లిదండ్రులు: చిట్టయ్య, రాజమ్మ భార్య: యశోదా దేవి పిల్లలు: శ్యాం సుందర్ శి వాజీ,ఝాన్సీ లక్ష్మీ,సుశీలా దేవి ,చదువు: మెట్రిక్యలేషన్ .స్వాతంత్రోద్యమంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి ప్రస్థానం 1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం 21 సంవత్సరాల వయసులో గాంధీజీ గారి పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపారు. ఫలితంగా అరెస్ట్ అయ్యి టెక్కలి,నరసన్నపేట, బరంపురం లలో 70 రోజులు పాటు జైలు జీవితం గడిపారు.

1932-శాసనోల్లంఘన ఉద్యమం 23 సంవత్సరాల వయసులో ఈ ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నడుపుచున్న సర్దార్ గౌతు లచ్చన్న ను అరెస్ట్ చేసి 6 నెలలు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు.1938-రైతు రక్షణ మాహా పాదయాత్ర జమీందారి, ఇనాం వ్యస్థల రద్దు కోరుతూ సర్దార్ గౌతు లచ్చన్న గారు 29 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో బారువ(ఇచ్ఛాపురం) నుండి మద్రాస్ వరకు 2,400 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర నిర్వహించి పెను సంచలనం సృష్టించారు ఫలితం:జమీందారి,ఇనాం వ్యస్థల రద్దు.

1940-సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో పలాస లో ఆల్ ఇండియా కిసాన్ సభ ను నిర్వహించారు అంటరానితనం పై కత్తి ఝుళిపించిన సర్దార్ గౌతు లచ్చన్న సర్దార్ గౌతు లచ్చన్న నడిపిన హరిజన సేవా సంఘాలు,హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి.రాత్రి పాఠశాలలు నిర్వహించి బహుజనులు విద్యాభివృద్ధికి కృషి చేసారు.హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించుటలో విశేష పోరాటం చేశారు.

1942-క్విట్ ఇండియా ఉద్యమం ఈ ఉద్యమ సమయంలో నాటి మద్రాస్ ప్రభుత్వం 33 సంవత్సరాల వయసున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని అతి ప్రమాదకరమైన వ్యక్తి గా ప్రకటించింది వారి ఆచూకీ తెలిపిన వారికి 10,000/- బహుమానం ప్రకటించింది అతనిని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కనిపిస్తే కాల్చి వేయండి అని SHOOT AT SIGHT ఆర్డర్స్ ఇచ్చినది చివరికి ప్రభుత్వమే 1942 లో లచ్చన్న గారిని బంధించి 1945 అక్టోబర్ వరకు జైలులో(దాదాపు 3 సంవత్సరాలు) ఉంచి తదుపరి విడుదల చేసినది.

1948 లో BACKWARD CLASSES CONFERENCE మొట్టమొదటిసారిగా గుంటూరు లో సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో BACKWARD CLASSES CONFERENCE ను నిర్వహించారు. తదుపరి అన్ని జిల్లాలు పర్యటించి ఆయా జిల్లాల్లో BACKWARD CLASSES ASSOCIATIONS ను నిర్మించారు.

1948-1983- సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 సార్లు M.L.A గా ఒకసారి M.L.C గా సుదీర్ఘ కాలం చట్టసభలలో ప్రజా గొంతుకై ప్రాతినిధ్యం వహించారు .1953 టంగుటూరి ప్రకాశం పంతులు&బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గాలలో సర్దార్ గౌతు లచ్చన్న గారు రాష్ట్ర వ్యవసాయ,కార్మిక శాఖా మంత్రి గా పనిచేశారు.

సర్దార్ లచ్చన్న గారు 1967 లో ఒకేసారి శ్రీకాకుళం జిల్లా నుంచి M.P గా,M.L.A గెలిచారు తన రాజకీయ గురువు గారైన ఆచార్య N.G.రంగా గారు ఆ ఎన్నికలలో చిత్తూర్ నుండి MP గా పోటీ చేసి ఒడిపోవడంతో , సర్దార్ లచ్చన్న గారు తన M.P పదవికి రాజీనామా చేసి రంగా గారిని శ్రీకాకుళం నుండి MP గా గెలిపించుకొన్నారు.

1972-జై ఆంధ్ర ఉద్యమం-ముల్కీ నిబంధనలను వ్యతిరేకిస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారు పోరాటం చేశారు.1975 ఇండిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీని లచ్చన్న గారి నాయకత్వంలోవ్యతిరేకిస్తూ ఆందోళనలు ఫలితగా సర్దార్ గౌతు లచ్చన్న గారిని 1975 అరెస్ట్ చేసి 1977 లో ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం విడుదల చేశారు.

గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో ప్రతిపక్ష నేత గా వ్యవహరించారు&పబ్లిక్ ఆకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 1997-ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు 1999-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.

2001- సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆటోబయోగ్రఫీ నా జీవితం పేరుతో ఆవిష్కరించారు.2006,ఏప్రిల్-19 న సర్దార్ గౌతు లచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో మరణించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *