TT Ads

జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ఈరోజు ఏఎస్పీ స్నేహ మెహ్రా నగరంలోని పలు ప్రాంతాలను పోలీసు అధికారులతో కలసి సందర్శించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లాండింగ్ ప్రదేశం, నూతన బస్‌స్టాండు, బహిరంగ సభ, వైకుంఠధామం, శ్రీశ్రీ సర్కిల్‌, పార్కింగ్ ప్రాంతాలు, విధినిర్వహణలో పోలీసులు తీసుకొవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గునేందుకు జిల్లాకు ఏప్రిల్ 2 న ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఆర్ అండ్ పోర్ట్ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సూచనల మేరకు ఏఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ , టౌన్ ఏసీపీ అంజనేయులు, ట్రాఫిక్ ఏసీపీ రమేష్ , సిఐలు చిట్టిబాబు ,తుమ్మ గోపి, శ్రీధర్, సురేష్ ,కరుణకర్ వీఐపిలు పర్యటించే ప్రాంతాల్లో సందర్శించారు.

నూతన బస్‌స్టాండు ప్రారంభోత్సవం ,సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ కు శంకుస్థాపన, మున్సిపల్ కార్పొరేషన్లో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, శ్రీశ్రీ సర్కిల్ నుంచి నిర్మించనున్న ఫోర్ లేన్ రోడ్డు పనులకు శంకుస్థాపన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం, వైకుంఠధామం ప్రారంభోత్సవ ప్రాంతాలను పరిశీలించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *