TT Ads

జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భముగా కట్టా వారి సేవా కేంద్రం ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నాలుగవ రోడ్డులో గల ప్రీతి యూరాలజీ & కిడ్నీ హాస్పిటల్ లో యూరాలజిస్ట్ డాక్టర్ వి.చంద్రమోహన్ గారిని మరియు రేడియాలజిస్ట్ డాక్టర్ P. రూపా గారిని శాలువాతో సత్కరించి పూల బోకేతో సన్మానించడం జరిగింది.
** ఈ సందర్భముగా యూరాలజిస్ట్ డాక్టర్ V. చంద్ర మోహన్ గారు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంలో కిడ్నీ ఎంతో కీలకమైనదని చెడు రక్తాన్ని వడపోసి మంచి రక్తాన్ని శరీరానికి అందజేయడంతో పాటు శరీరంలోని బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుందని శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి పలు కీలకమైన పనులను కిడ్నీ నిర్వహిస్తుందని కిడ్నీ సరిగా పనిచేయకపోతే రక్తంలో మలినాలు పెరిగిపోయి రాళ్ళు ఏర్పడటం వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందనీ, కిడ్నీ వ్యాధులు మనిషిని ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా దెబ్బతీస్తున్నాయని, కిడ్నీ బాధితుల్లో షుగర్ హై బీపీ అధిక బరువు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారని, అందువల్ల ప్రతివారు కిడ్నీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఎవరికివారు కిడ్నీల సంరక్షణపై దృష్టి సారించాలని రక్త ప్రసరణ కిడ్నీ ఫంక్షన్ స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాలని డాక్టర్ల సలహాల మేరకు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని కిడ్నీలను కాపాడుకోవాలని, ప్రతి రోజూ వ్యాయామం చేయటం పౌష్టికాహారం తీసుకోవడం ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగటం మంచిది అని సూచించారు.
** ఈ కార్యక్రమములో కట్టా వారి సేవా కేంద్రం నిర్వాహకులు కట్టా నరసింగరావు, కొల్లా శంకర్, విద్యా వెంకట్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *