TT Ads

ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం తరపున జాతీయ షెడ్యూల్డ్ తెగలు కమిషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ వి అశోక్ వర్ధన్ ను ఖమ్మం ఖానాపురం గెస్ట్ హౌస్ లో ఎల్.హెచ్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర చౌహన్ , రాష్ట్ర కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసిన శాలువాతో ఘనంగా సత్కరించారు .అనంతరం ప్రధానంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కులు కల్పించే విధంగా చూడాలని , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటే ఐటీడీఏ కార్యాలయం ఉందని అది కూడా భద్రాచలంలో ఉంది . ఖమ్మం జిల్లాలో కూడా ఐటిడిఎ ఏర్పాటు చేయాలని కోరారు . స్పందించిన కమిషన్ ఐటిడిఎ విషయంలో సంబంధిత అధికారులకు సంబందించి ముపై రోజుల్లో న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *