TT Ads

ఈరోజు పలాసా కాశీబుగ్గ మునిసిపల్ ఆఫీస్ ప్రాంగణంనుండి రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశు సంవర్ధక కార్యక్రమాలపై సమీక్షలు చేశారు. పాడి సమృద్ధిగా ఉండాలంటే పచ్చి మేత రైతులకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం 167 కోట్ల నిధులతో 20 వేల ఎకరాల్లో బహువార్షిక పశుగ్రాసాలను అభివృద్ధి చేసి 140 లక్షల టన్నుల పశుగ్రాసాలు ఉత్పత్తి చేసి 20 లక్షల పాడి పశువులకు పోషణ అందించనున్నారు. ఈ రోజు ప్రారంభించిన ఈ పథకం ద్వారా విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.అదే విధంగా దేశీయ పశు జాతుల అభివృద్ధి లక్ష్యంతో ఒక్కో యూనిట్ 30 లక్షల విలువ తో 25 యూనిట్స్ ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని, పశు వైద్యులు శ్రమించి ఈ పథకాన్ని విజయవంతం చేస్తే ముఖ్యమంత్రి మరిన్ని యూనిట్స్ మంజూరు చేస్తారన్నారు.
పాడి రైతులకు యంత్రాలు అందుబాటులో ఉండేందుకు రాష్ట్రంలో 45 Custum Hiring Centres (CHC) ఏర్పాటు చేయబోతున్నామని ఇందుకు ఒక్కో సెంటర్ కు 14.7 లక్షలు కేటాయింపు చేశామన్నారు.

ఆత్యవసర పరిస్థితిలో పశువుల అంబులెన్స్ లను కూడా ప్రవేశపెడుతున్నామని, ఇది చరిత్రలోనే నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు.ముఖ్యమంత్రి మనసా పుత్రిక (brain Child) పథకం.రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. వీటి ద్వారా గ్రామస్థాయిలో పశువులకు వైద్యసేవలు అందించడం తో పాటు శాస్త్రేయ అవగాహన పెంచేందుకు అందరూ శ్రమించాలన్నారు. పశు వైదులు నిర్దేశించిన రోజుల్లో ముందుగా రైతులకు సమాచారాన్ని ఇచ్చి, రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు ఒక్కో పశు వైదునికి నెలకు 2000 రూపాయల వరకు రవాణా భత్యం ఇస్తామన్నారు.

చేయూత పథకం ద్వారా గ్రామ స్థాయి మహిళలకు స్వయం ఆర్ధిక సమృద్ధి ని సాధించేలా, పాడి,జీవాల పంపిణీ త్వరత్వరగా పూర్తిగా చేయాలన్నారు.నాడు నేడు పథకం ద్వారా పశు వైద్య భవనాలు అభివృద్ధి చేస్తామన్నారు.
గొర్రెల పెంపకం అనేది చాలావరకు వలసలతో ముడిపడి ఉంటుంది కనుక వలసవెళ్లిన జీవాలకు ఎక్కడకు వెళ్ళితే అక్కడ వైద్యం అందేలా తగు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక ముఖ్యకార్యదర్శి డా.పూనం మాలకొండయ్య, పశు సంవర్ధక సంచాలకులు డా.అమరేంద్ర, శ్రీకాకుళం జిల్లా సంయుక్త సంచాలకులు డా.ఈశ్వరరావు, ఉప సంచాలకులు డా.జయరాజ్,డా.మాదిన ప్రసాదరావు,డా.మన్మదరావు, సహాయ సంచాలకులు డా.మోహిణికుమారి,చంద్రశేఖర్,జయప్రకాష్,రఘునాధ్, రవికృష్ణ, దుర్గారావు, పాపారావు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *