TT Ads

రాజేంద్రనగర్: జల్సాలకు అలవాటు పడి అప్పులు కావడంతో అవి తీర్చలేక కన్నా కొడుకునే అమ్మిన సంఘటన నగర శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఎంఎం పహాడీకి చెందిన హైదర్ అలీ తన కుటుంబంతో కలిసి నివాసంముంటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే జల్సాలకు అలవాటు పడ్డ హైదర్ అలీ ఆటో నడపగా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో తన స్నేహితుల సలహా మేరకు తన కన్న కొడుకును 3,80000 రూపాయలకు భార్య షెహన బేగం కు తెలియకుండా అమ్మాడు. తన బిడ్డ ఏడని భర్తను అడగగా పొంతన లేని సమాధానాలు చెప్తూ చివరకు డబ్బుల కోసం కొడుకును అమ్మానని ఒప్పుకున్నాడు. తల్లి షెహనా బేగం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాబును కొనుగోలు చేసిన అబ్దుల్ రియాజ్ , సాహీదా బేగం తో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బాబును తన తల్లికి అప్పగించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *