TT Ads

జర్నలిస్ట్ మిత్రులారా మన ప్రాణాలు ముఖ్యం. మీకు ఏమైనా అయితే యాజమాన్యం మీ వెంట రాదు. సాయం చేసే స్థాయిలో మన తోటి మిత్రులు ఉండరు.. గుర్తుంచుకోండి.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన ఏ ఛానల్, ఏ పత్రిక జర్నలిస్ట్ అయిన ఒక్కసారి మీ తల్లిదండ్రులు, భార్య,పిల్లల కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి. వాళ్ళు ఆనందంగా ఉండాలంటే కరోనా లో మీరు విధులు ప్రక్కన బెట్టండి. రెండు నెలలు విధులకు విరామం ఇస్తే ఏమంత ఇబ్బంది రాదు. కల్లో,గంజో తాగి బతకవచ్చు.

కరోనా మహమ్మారి ఏడాదికి పైగా విరుచుకుపడింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్ మిత్రులు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఎంతో మంది మిత్రులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆదుకోవడంలో పూర్తిగా విఫలం చెందింది. కరోనా సోకితే ప్రైవేట్ ఆసుపత్రిలో నిజంగా మన జర్నలిస్టులు ఆ ఖర్చు భరించగలరా..? చెప్పండి. యాడ్స్ తెచ్చుకొని జీతాలు తీసుకొంటున్న రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంత అంకితభావంతో పని చేసి ఆంధ్రప్రభ సాయి లా ప్రాణాలు కోల్పోవడం అవసరమా.. పోనీ మనం ఇంత అంకితభావంతో పనిచేసినా మనల్ని ప్రభుత్వం, యాజమాన్యం(ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా,యూట్యూబ్, సోషల్ మీడియా) అస్సలు పట్టించుకోదు.

యాజమాన్యం పట్టించుకోపోయినా మీరు మాత్రం అంకితభావం, వంకాయ అంటూ రోడ్ల మీద వార్తలు, యాడ్స్ కోసం పడుతున్నారు. దీని వల్ల కరోనా బారిన పడి హాస్పిటల్స్ లో చేరి రోజు 5 లక్షలు ఎక్కడ తెచ్చి కట్టగలరు అసలు ఆలోచించారా..? మనం వాడే లోగో వల్ల ఎంత ప్రమాదం ఉందో తెలుసా. ఇంత ప్రాణాపాయంలో యాజమన్యం పట్టించుకోని స్థితిలో మనకు ఈ బాధలు అవసరమా అని ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఆలోచించడం లేదు. ఎక్కడ చూసినా శవాలు గుట్టలు కనపడుతున్నా జర్నలిస్టులు మారరా.. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ మంచి కోసమే కొద్దికాలం రిపోర్టింగ్ కు దూరంగా ఉండండి. లేదా మీ మీద ఆధారపడిన వారి జీవితాలు చెల్లాచెదురు అవుతాయి. మనల్ని ఎవ్వరూ రక్షించరు… మన ఎమ్మెల్యేలు, మంత్రులు అస్సలు పట్టించుకోరు. జర్నలిస్ట్ లారా ఒక్క నిమషం.. మీ అమ్మా, నాన్న, మీ భార్య పిల్లలు గుర్తు తెచ్చుకుని డ్యూటీ కు వెళ్ళండి.గౌటి రామకృష్ణ,ప్రధాన కార్యదర్శి,(తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం-TJSS)

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *