TT Ads

జర్నలిస్టులకు రక్షణ కరువవుతున్న వైనం

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలి

డిమాండ్స్ వ్యక్తపరిచిన ఏడబ్ల్యుజేఏ

మేడ్చల్ / మల్కాజ్గిరి జిల్లా: తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను మేడ్చల్ జిల్లా ఏ . డబ్ల్యు .జె .ఏ ఉపాధ్యక్షులు పోరండ్ల యాదగిరి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం ఏ . డబ్ల్యు .జె .ఏ జాతీయ అధ్యక్షులు కే కోటేశ్వరరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కొండపర్తి సదా చారి ఆదేశానుసారం ప్రకారం జిల్లా మండల కేంద్రంలోని కాప్రా మండల తహసిల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోరండ్ల యాదగిరి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వార్తలను ప్రచురిస్తూ తమ వంతు బాధ్యతను నిర్భయంగా ముందుకు సాగుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పై ఇలా దాడులకు పాల్పడడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పై దాడులకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పై జరుగుతున్న వరుస దాడుల వ్యవహారంపై ఏ. డబ్ల్యు .జె.ఏ జాతీయ కోటేశ్వరరావు త్వరలో కేంద్ర ప్రభుత్వ తో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి కి తీసుకెళ్ల నున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తునికి రమేష్ చారి, పాంబోజు గంగాధర్ చారి,మహమ్మద్ రియాజ్, రామ్, లక్ష్మణ్, పాంబోజు గంగాధర్ చారి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *