TT Ads

నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వామపక్షాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు బలపరిచిన సీపీఐ అభ్యర్థి జయ సారధి రెడ్డి ని గెలిపించాలని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ జానిమియా కోరారు. ఈ రోజు బుధవారం ఖమ్మం నగరంలో వన్ టౌన్ లో 11,12,13 వ డివిజన్లో శాసన మండలి ఎన్నికల 309,10,11,12, స్టేషన్ ల పరిధిలో గల గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఓట్లు ఆభ్యర్ధిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, వర్గాన్ని పూర్తిగా విస్మరించిన టిఆర్ఎస్ పార్టీ ఈ శాసన మండలి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని శాసన మండలిలో సమస్యలపై ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు కలిగిన అభ్యర్థి బి. జయసారధి రెడ్డి అని అటువంటి జయసారధి రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వన్ టౌన్ ఏరియా కార్యదర్శి చామకూరి వెంకన్న, నాయకులు మాడుగుల నాగేశ్వరరావు, రమేష్, రామరావు, మాల కొండయ్య, వెంకన్న, నర్సింహారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *