TT Ads

జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ, మరియు వాటి సంరక్షణ తదితర అంశాలపై అంతరాష్ట్ర సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలనుంచి అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. గుంటూరు లో ని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి, రాష్ట్ర వన్యప్రాణి విభాగం ముఖ్య సంరక్షణాధికారి ఎన్. ప్రతీప్ కుమార్ మాట్లాడుతూ ఏనుగులు తరచుగా జనారణ్యం లోకి, పంట పొలాల్లోకి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవడమే కాకుండా , ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర అటవీ శాఖ ఏనుగులు అడవులు దాటి బయటికి రాకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నా పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక నుంచి తరచుగా ఆంధ్ర ప్రదేశ్ లో కి ప్రవేసిస్తున్నాయన్నారు. కౌండిన్య అభయారణ్యములో ఆహారం నీటి లభ్యత తక్కువగా ఉండడంతో చిత్తూరు జిల్లా పలమనేర్ పరిధిలో ని కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీ నుంచి ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయన్నారు.

రైతులు వన్యప్రాణుల నుంచిరక్షణగా కరెంటు తీగలను అమర్చుతుండడంతో అవి విద్యుత్ షాక్ కు గురై మరణిస్తున్నాయని ఆయన తెలిపారు ఏనుగులు తరలింపు లో భాగంగా తమిళనాడు సిబ్బంది కాల్పులు జరుపుతుండడంతో తమిళనాడు ప్రాంతంలోని ఏనుగులు సైతం కౌండిన్య వైపు వచ్చి చేరుతున్నాయన్నారు. ఇక కర్ణాటక నుంచి ఏనుగులు కుప్పం మీదుగా ఇదే అడవులు లోకి రావటం తో సమస్యలు తలెత్తుతున్నాయని ఏపీ అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులకు వివివరించారు.

ఈ సంధర్భంగా మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశం లో పలు సూచనలు చేయడమే కాకుండా ఇక తరచుగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా సమస్య పరిష్కారం కోసం సమన్వయం తో ముందుకు పోవడం తప్ప మరొక మార్గం లేదని సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. కౌండిన్య అభయారణ్యం మూడు రాష్ట్రాల పరిధిలో ఉండడంతో మూడు రాష్ట్రాలను కలుపుతూ ఎలిఫెంట్ కారిడార్ ను ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. అదే విధంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ అధికారి ని నియమించాలని సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు. మూడు రాష్ట్రాల అధికారులు కలిసి ఒక ఏకాభిప్రాయం తో సంయుక్త కార్యాచరణ లో భాగంగా ఒక నిర్దిష్ట ప్రతిపాదన పొందుపరచి మూడు రాష్ట్రాలకు లాభదాయకం గా ఉండేలా ప్రణాలిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. నివారణ చర్యలలో భాగంగా చేపట్టిన విజయవంతమైన చర్యలు పరిశీలించడానికి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రతీప్ కుమార్ పర్యటించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశం లో పీసీసీఎఫ్(రీసెర్చ్) ఏకే నాయక్.. కర్ణాటక వన్యప్రాణి ముఖ్య సంరక్షణాధికారి విజయకుమార్ గోపీ, తమిళనాడు ముఖ్య సంరక్షణాధికారి ముంజమిల్ అబ్బాస్,తమిళనాడు అడిషనల్ పీసీసీఎఫ్ విజయేంద్ర మాలిక్, కర్ణాటక అడిషనల్ పీసీసీఎఫ్ సుభాష్ మేల్కోడే, మూడు రాష్ట్రాల ఉన్నతాధికారులు దీపక్ బిలిగి. వెంకటేష్, శ్రీనివాస శాస్త్రి, శివ శంకర్.రవి శంకర్.
తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని డీసీఎఫ్ నాగ మణేశ్వరి సమన్వయం చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *