TT Ads

కృష్ణాజిల్లా మచిలీపట్నం:ఈ రోజు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను పోలీస్ సిబ్బంది తో పాటు సహాయకారిగా విధులు నిర్వర్తించడానికి హాజరవుతున్న సచివాలయ సిబ్బందికి(మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది)లకు జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు “పారా పోలీస్ కృష్ణాజిల్లా” అనే పేర్లతో కూడిన క్రాస్ బాండ్ లు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో హాజరుకానున్న 2540 మంది సచివాలయ సిబ్బందికి అందజేశారు.

వీటిని గూర్చి ఎస్పీ గారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి యూనిఫాం లేని కారణంగా మఫ్టి లోనే విధులకు హాజరవుతారని, దాని ద్వారా వీరు చేస్తున్న సేవలకు సరైన గుర్తింపు లభించడంలేదని, అలా కాకుండా వీరు శాఖలో మిళితమై సేవ చేస్తున్నారనే భావన వారిలో కలిగించడానికి, ప్రజల్లో కూడా వారికంటూ ఒక గుర్తింపు తీసుకురావడానికి ఒకే యూనిఫాం ల ఈ పారా పోలీస్ బ్యాండ్ లను అందజేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఎన్ఎస్ఎస్ , ఎన్సిసి వాలంటీర్ల 994 మందికి క్యాప్ లను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *