TT Ads

ఏం.. భాస్కర్ బాగున్నావా బాగా పనిచేస్తున్నావ్కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు తయారు చేసిన ఔషదం నాకు కూడా అందిందయ్యా.. నువ్వు ఇలాగే ప్రజాక్షేమం కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి అంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ.రమణ, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆత్మీయంగా పలకరించి అభినందించారు. శుక్రవారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ క్రమంలో చీఫ్ జస్టీస్ ఆయన్ను పై విధంగా ఆత్మీయంగా పలకరించారు. మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరంను సందర్శిస్తానని చెవిరెడ్డికి తెలిపారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని ఆయన ఆదేశించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *